ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని డిపో ముందు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించి... తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: మరణించిన భార్యకు... మందిరం కట్టాడు భర్త..!