Hayatnagar Rajesh Murder Case Latest Update : హైదరాబాద్ శివారు పెద్దఅంబర్‌పేటలో కలకలం రేపిన యువకుడి మృతదేహం లభ్యమైన వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పెద్ద అంబర్‌పేట్ వద్ద డాక్టర్స్ కాలనీ సమీపంలో... పంచోత్కులపల్లికి చెందిన యువకుడు రాజేశ్ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. అయితే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే రాజేశ్‌ను హత్య చేసినట్లు భావించిన పోలీసులు... ఆ దిశగా విచారణ చేపట్టారు.
Kuntloor Rajesh murder Update : హయత్‌నగర్‌లో రాజేశ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజేశ్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేశ్ సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం ఉపాధ్యాయురాలి భర్తకు తెలవడంతో ఆమెను మందలించాడు. దీంతో తాను చనిపోతానని ఉపాధ్యాయురాలు రాజేశ్ కు వాట్సాప్ సందేశం పంపి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే అప్పటి నుంచి రాజేశ్ ముభావంగా ఉంటున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది.
Rajesh Murder Case Latest news : ఈ క్రమంలో రాజేశ్ మృతదేహాం లభించడంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుందనే బాధతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా.... లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రాథమికంగా రాజేశ్‌ను టీచర్ భర్త నాగేశ్వర్‌రావు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాగేశ్వర్‌రావు, ఆయన బంధువులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో రాజేశ్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు గందరగోళానికి గురవుతున్నారు.
రాజేశ్ ఎవరో తెలియదు : హయత్‌నగర్ రాజేశ్ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వ ఉపాధ్యాయురాలి భర్త నాగేశ్వర్‌రావు తెలిపారు. రాజేశ్‌పై తాము దాడి చేశామనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తన భార్యను ఎవరో బ్లాక్ మెయిల్ చేశారని.. అందుకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆమె మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని పోలీసులను నాగేశ్వరరావు కోరారు.
"నా భార్య ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్లు నాతో చెప్పలేదు. కుటుంబ పరంగా, ఉద్యోగం పరంగా ఎలాంటి సమస్యలు లేవు. మా కుటుంబం అంతా ఇక్కడే ఉంటారు. ఎవరితో కూడా ఎలాంటి విషయాలు చెప్పలేదు. ఎవరో ఆమెను బ్లాక్ మెయిల్ చేసుంటారు. అందుకే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుంటుంది. చనిపోయే ముందు బ్యాక్ పెయిన్‌తో ఇలా చేశానని పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. గత నెల రోజులవి కాకుండా ముందు నుంచి ఉన్న కాల్ డేటా అంతా చూస్తే వాస్తవాలు బయటపడతాయి. అంత్యక్రియల అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాం. రాజేశ్ అనే వ్యక్తి మాకు తెలియదు." - నాగేశ్వరరావు
మొదట రాజేశ్ ఎవరో తెలియదన్న నాగేశ్వరరావు.. పోలీసులు ప్రశ్నించడంతో.. తన భార్యకు, రాజేశ్‌కు వయసులో చాలా వ్యత్యాసం ఉందని.. సామాజిక మాధ్యమం ద్వారా వారు పరిచయమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నాగేశ్వరరావు మాటలో మరింత గందరగోళానికి గురైన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం..
ఇవీ చదవండి: