రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురుకుల ప్రవేశ పరీక్ష కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా వల్ల ఈ ఏడాది విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రఘునందన్ తెలిపారు.
కరోనా నిబంధనలతో విద్యార్థులను పరీక్షించాకే లోపలికి అనుమతించారు. పరీక్ష హాలుకు ఒక గంట ముందుగానే విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇబ్రహీంపట్నంలో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, బెంచీకి ఒక విద్యార్థి ఉండేలా ఒక గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.