శంషాబాద్ మండలం రావిరాలలో భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారం నిర్వహిస్తోన్న ఓ సంస్థకు చెందిన గోదాంలు శంషాబాద్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్నట్లు గుర్తించారు. ఈనెల 3, 4, 5 తేదీల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5.45 కోట్ల విలువైన 19 కిలోల బంగారం, రెండు కిలోల విలువైన రాళ్లు ఎగుమతి చేసినట్లు పత్రాల్లో పేర్కొన్నా.. కేవలం 565 గ్రాముల బంగారం, 20.85 కిలోల రాళ్లు మాత్రమే ఎగుమతి చేసినట్లు గుర్తించారు.
అనంతర తనిఖీల్లో 21 కిలోల బంగారం, 6.8 కిలోల బంగారు ఆభరణాలు, 491 కిలోల విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.14.87 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం వ్యాపారి 1100 కిలోల పసిడిని దారి మళ్లించినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఈ కేసులో నలుగురిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: పుత్తడి కొనుగోళ్ల ఉత్సాహం అక్షయ తృతీయ వైభవం