రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యాసంస్థలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో నూతన ఆవిష్కరణలపై నాలుగో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మలేషియా యూనివర్సిటీ టెక్నాలజీ పెట్రోనాస్ ప్రొఫెసర్ పానోజి హస్మత్ హుస్సేన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ శ్రీరామ తాడేపల్లి, కళాశాల డైరెక్టర్ హెస్ఎస్.సైని, రామలింగారెడ్డి హాజరయ్యారు.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆలోచనలను చర్చించడానికి విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని వక్తలు తెలిపారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలందరినీ ఒకే వేదికగా ఈ సదస్సు నిర్వహించడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సదస్సుకు కెనడా, ఒమాన్, దక్షిణకొరియా, సౌదీఅరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి వచ్చిన పరిశోధన పత్రాలను చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలు సుమారు 250కి పైగా పరిశోధన పత్రాలు ఈ సదస్సులో సమర్పించారు.
ఇదీ చూడండి : మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ