Abhishek Agarwal adopted to Timmapur: కాశ్మీర్ఫైల్స్, కార్తీకేయ2 లాంటి సినిమాలు నిర్మించి సినీ పరిశ్రమలో మంచిగుర్తుపు తెచ్చుకున్న వ్యక్తి అభిషేక్ అగర్వాల్. నిర్మాతగానే కాకుండా కొవిడ్ సమయంలో మంచి సేవాకార్యక్రమాలు చేసిన ఆయన.. తాజాగా తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి స్వగ్రామంమైనా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
అభిషేక్ అగర్వాల్ కుటుంబం స్థాపించిన చంద్రకళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక దివస్‌లో ఈ వేడుకను నిర్వహించారు. కార్యక్రమంలో భారత్ స్టార్ షెట్లర్ పీవీ సింధూ, నటుడు అనుపమ్ ఖేర్, దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి, ఉత్తరప్రదేశ్ మంత్రి నందగోపాల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అనంతరం దత్తత గ్రామం తిమ్మాపూర్ మైలురాయిని ఆవిష్కరించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామంలోని పలువురు విద్యార్థినీ విద్యార్థులకు కంప్యూటర్లు కానుకగా అందజేశారు.
ఇవీ చదవండి: