కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏపీ కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన సాదిక్ బాష వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈనెల 13న రాత్రి 9 గంటల సమయంలో సాదిక్ బాష చరవాణికి ఓ సందేశం వచ్చింది. కరోనా మరోసారి విరుచుకుపడుతోందని... కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని దాని సారాంశం.
ఈ విషయాన్ని వెంటనే సాదిక్ బాష తన బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు పంపించాడు. సదురు మెసేజ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు చేరింది. తప్పుడు సమాచారాన్ని అందరికీ పంపించి... ప్రజల్లో భయాందోళనకు కారణమైనందుకు సాదిక్ బాషపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇవీచూడండి: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం