రాష్టంలో కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. కరోనా వైరస్ ప్రబలకుండా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలోని ప్రధాన రహదారి వెంట సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇంటి నుంచి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకొని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవి కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సీతారామరాజులు పాల్గొన్నారు.