ETV Bharat / state

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్

author img

By

Published : Sep 30, 2022, 6:00 PM IST

Updated : Sep 30, 2022, 6:54 PM IST

17:58 September 30

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీ కాలం 2023 మార్చి 29తో ముగియనుంది. దీంతో ఆ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా ఓటర్ల జాబితా తయారీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రేపటి నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. డీనోవా పద్ధతిన ఓటర్ల జాబితా తయారు చేస్తారు.

అంటే గతంలో ఉన్న ఓట్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కు కోసం అర్హులైన ఉపాధ్యాయులు రేపటి నుంచి ఫారం 18ను సమర్పించవచ్చు. నవంబర్ ఏడో తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 23న ఓటరు జాబితా ముసాయిదా ప్రకటించి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.

ఇవీ చూడండి..

యాదాద్రీశుడి బంగారు తాపడం కోసం కేసీఆర్ విరాళం.. ఎంత ఇచ్చారంటే..?

ఘనంగా 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​.. ముర్ము చేతులు మీదుగా ప్రదానం

Last Updated : Sep 30, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.