రంగారెడ్డి జిల్లా ఎర్రగుంటలోని ఒవైసీ కాలనీలో రెండేళ్ల నుంచి డ్రైనేజీ సమస్య ఉంది. కనీసం నడవడానికి కూడా దారి లేదు. ఇళ్ల ముందు మురికి నీరు భారీగా నిల్వ ఉండడం వల్ల దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు కాలనీ వదిలేసి వెళ్తున్నారు. ఈ సమస్యపై జలపల్లి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు.
శంకుస్థాపన చేసినా
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గత నెలలో పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదని, అధికారులను, ఎమ్మెల్యేను ఎన్ని సార్లు వేడుకున్నా ఫలితం లేదని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: తొలి రఫేల్ యుద్ధ విమానానికై ఫ్రాన్స్‌కు రక్షణమంత్రి