సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు నియంత్రించి దేశంలోనే తెలంగాణ పోలీస్ తొలి స్థానంలో నిలిచిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి సబితా, ఎమ్మెల్యే కాలయాదయ్య, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. తక్కువ కాలంలోనే పోలీస్ శాఖకు పోలీసులకు అవసరమైన వాహనాలు, ఇతర వసతులు కల్పించి.. నేరాల నియంత్రణకు సీఎం కేసీఆర్ కృషిచేశారని హోంమంత్రి అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతో పోలీస్ స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహిళలు నేరుగా ఠాణాలకు వచ్చిన ఫిర్యాదులు చేస్తున్నట్లు గుర్తుచేశారు. షీ టీమ్స్ ఏర్పాటుతో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.
ఇవీచూడండి: అసత్య ప్రచారాలు చేయొద్దు: ఈటల