రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలన్ గ్రామంలోని రైతులకు వానాకాలం పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి హాజరయ్యారు.
భూసార పరీక్షలు చేసుకున్న తరువాతే పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులకు సూచించారు. పంటలకు తప్పకుండా బీమా చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటింటి అధిక దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ నూతన పంటల సాగు విధానమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి గీతారెడ్డి తెలిపారు.