ప్లాస్మాదానం చేసి ఓ వృద్ధురాలి ప్రాణం నిలబెట్టారు కానిస్టేబుల్. హైదరాబాద్ మలక్‌పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 సంవత్సరాల శ్రీదేవమ్మకు కానిస్టేబుల్ సురేందర్ ప్లాస్మా దానం చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సురేందర్ ప్లాస్మా దానం చేసి ప్రాణాన్ని కాపాడారు. సురేందర్‌కు పేషెంట్ తరఫు బంధువులు ధన్యవాదాలు తెలిపారు.
- ఇదీ చూడండి : భయం భయం: హడలెత్తిస్తున్న చిరుతల సంచారం