Congress Vijayabheri Sabha 2023 : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. మూడు రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు పీసీసీ స్పష్టం చేసింది. ప్రతి బూత్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యేట్లు చూడాలని ముఖ్య పరిశీలకులకు రాష్ట్ర కాంగ్రెస్ సూచించింది.
Congress Vijayabheri Sabha in Telangana : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా 16, 17 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ అగ్ర నాయకులు అంతా 15వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. 16, 17 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు తాజ్ కృష్ణ హోటల్‌లో నిర్వహిస్తారు.
ఈ సమావేశాలకు సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు వస్తారని టీపీసీసీ వెల్లడించింది. సోనియా గాంధీ చేతుల మీదుగా సికింద్రాబాద్ గాంధీ ఐడియాలజీ కేంద్రంలో భవన నిర్మాణాలకు పునాది రాయి వేస్తారు. అనంతరం తుక్కుగూడ వద్ద నిర్వహించ తలపెట్టిన భారీ భహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అక్కడ సోనియా గాంధీ చేతుల మీదుగా ఐదు గ్యారంటీలను ప్రకటిస్తారు.
Congress Vijayabheri Public Meeting 2023 : తుక్కుగూడ విజయ భేరి బహిరంగ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభ విజయవంతం కావడంతో ఈ సభకు అంతకంటే ఎక్కువ మందిని తరలించి.. దానిని మించిన విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి గాంధీభవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశమైన పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే, ముఖ్య పరిశీలకులతో కలిసి పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు.
చకచకా ఏర్పాట్లు.. : తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని.. పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు పీసీసీ స్పష్టం చేసింది. ప్రతి బూత్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యేట్లు చూడాలని ముఖ్య పరిశీలకులకు రాష్ట్ర కాంగ్రెస్ సూచించింది. మూడు రోజుల్లో ఏఏ నియోజకవర్గాల నుంచి ఎంత మంది జనం వస్తారో ఒక నివేదిక ఇవ్వాలని పీసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు సభ నిర్వహణకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
Congress CWC Meeting Arrangements in Telangana : 'ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయభేరి సభను ఆపలేరు'