తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్, 111 జీవో ఎత్తివేయాలని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. 111 జీవో ఎత్తి వేస్తామని స్వయంగా రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యను అడిగితే తమపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో 84 గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రైతులతో మాట్లాడిన మమత- సరిహద్దుకు ఐదుగురు ఎంపీలు