Chinna Jeeyar Swamy: స్థిరాస్తి సంస్థ ఏస్ అనంత వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి పూజ కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామిజీ పాల్గొన్నారు. అనంతరం మహా సుదర్శన యాగంలో పాల్గొని ఆధ్యాత్మికతపై ప్రవచనాలు వినిపించారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ పురపాలిక పరిధిలోని తట్టిఅన్నారంలో నిర్మిస్తున్న విల్లాస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
Bhoomi pooja: దాదాపు పద్నాలుగు ఎకరాల్లో 127 విల్లాలు నిర్మిస్తున్నామని ఏస్ అనంత వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీకాంత్ తెలిపారు. ఈ వెంచర్ భూమి పూజకు చిన జీయర్ స్వామి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అజంతా ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్న విల్లాలను నగర వాసులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలతో అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని ఎండీ శ్రీకాంత్ వెల్లడించారు.