ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడాన్ని స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోల ప్రభాకర్ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్-బీజపూర్ రహదారిపై టపాసులు పేల్చి స్వీట్లు పంచారు.
ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ చట్టంతో రైతులకు మంచి జరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్