ETV Bharat / state

పతుల గెలుపు కోసం... సతుల ఆరాటం - SANGEETHA REDDY

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష ఎంపీ అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్న అభ్యర్థులు... ఒకరిని మించి మరొకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హైఫై ప్రచారంతో కొండా విశ్వేశ్వర్​రెడ్డి జోరు పెంచగా.. అధికార నినాదంతో రంజిత్​రెడ్డి కారు గేరు మార్చారు. అటు పతుల ప్రచారానికి తోడుగా సతులు కూడా రంగంలోకి దిగారు. మండుటెండల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ... పతులను గెలిపించుకునేందుకు తమ వంతు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

పతుల గెలుపు కోసం... సతుల ఆరాటం
author img

By

Published : Apr 3, 2019, 10:42 AM IST

పతుల గెలుపు కోసం... సతుల ఆరాటం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరవేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బరిలో నిలిచిన తెరాస, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇద్దరూ వ్యాపార నేపథ్యం కలవారు. ఇప్పటికే అధికార తెరాస ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో ప్రధాన నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించి క్షేత్రస్థాయిలో జోరుమీదున్నారు. సభలు, సమావేశాలతో పార్టీ శ్రేణులను కలుపుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు.

వ్యూహాత్మకంగా కొండా ప్రచారం
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ముందు నుంచే వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మండలాలు, గ్రామాల వారీగా యువతను ప్రచారంలో భాగస్వాములను చేస్తూ గత ఐదేళ్లలో ఎంపీగా చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. వామపక్షాలతో పాటు తెలంగాణ జనసమితి పార్టీ మద్దతు కూడగట్టుకొని రెండోసారి ఎంపీగా గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు.

గల్లీల బాట పట్టిన సంగీతారెడ్డి

ఈ ఇద్దరు అభ్యర్థుల ప్రచారం ఒకవైపు అయితే... వీరి సతీమణులు కూడా ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. భర్తల గెలుపు కోసం పల్లె పల్లెనా... వీధి వీధినా తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి, ఆపోలో ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి ప్రచారంలో వినూత్న పద్దతిని అనుసరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎదురైన వారికి హైఫై ఇస్తూ... చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. మరోసారి తన భర్తను గెలిపించి పార్లమెంటుకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంటింటికి వెళ్లి సీతారెడ్డి ప్రచారం

మరోవైపు రంజిత్​రెడ్డి భార్య సీతారెడ్డి కూడా భర్తను ఎంపీగా గెలిపించుకునేందుకు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తెరాస కార్యకర్తలతో కలిసి ఉదయం, సాయంత్రం వేళల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో రంజిత్ రెడ్డిని గెలిపించి కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఓటర్లకు వివరిస్తున్నారు.

మండుటెండల్లో కూడా పతుల గెలుపు కోసం ఈ సతులు పడుతున్న ఆరాటాన్ని చూసి ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏసీ భవనాల్లో ఉంటూ... కార్లలో తిరిగే కోటీశ్వరులకు ఎంత కష్టమొచ్చి పడిందనుకుంటూ తమ పని తాము చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి: రాహుల్​ గాంధీ, ఏచూరికి కోర్టు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.