సమాజంలో ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి ఉందంటే సిగ్గుపడాలని కేంద్ర సహాయ మంత్రి సంజీవ్‌కుమార్ అన్నారు. శంషాబాద్‌లోని వెటర్నరీ వైద్యురాలి నివాసంలో ఆమె కుటుంబసభ్యులను సంజీవ్‌కుమార్ పరామర్శించి సానుభూతి తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులకు త్వరగానే శిక్షపడేలా చేస్తామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించానని, సీపీనికలిసి వివరాలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
ఇవీ చూడండి: 'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'