ETV Bharat / state

Vanasthalipuram Temple: వెంకటేశ్వరస్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు.. - వనస్థలిపురం వెంకటేశ్వరస్వామి ఆలయం

వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. కార్తికమాసం సందర్భంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

vanasthalipuram
శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Dec 5, 2021, 4:10 PM IST

హైదరాబాద్‌ వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాస బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. వారం రోజులుగా జరుగుతున్న ఉత్సవాలను నిర్వహించారు. కార్తిక మాసం కావడంతో భక్తులు పెద్దఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు.

vanasthalipuram Temple
స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులు

ఏడు రోజులుగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవకలశ స్థాపన, తిరుమంజనం, చక్రస్నానం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్తిక మాస ప్రత్యేకత ప్రతిబింబించేలా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. స్వామివార్లకు సుదర్శన, నరసింహ, మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు.

vanasthalipuram Temple
వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవాలు

ప్రత్యేక వాహనసేవలు

పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక వాహన సేవలు, కలశస్థాపన వంటి వైదిక క్రతువులు సైతం జరిపించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

vanasthalipuram Temple
వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో పూజలు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.