ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను వాడుకున్న ప్రభుత్వానికి మంచి పీఆర్సీ ఇవ్వడానికి చేతులు రావడం లేదని మాజీ ఎమ్మెల్సీ, భాజపా నాయకుడు మోహన్ రెడ్డి విమర్శించారు. 7.5శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
పీఆర్సీ నివేదికకు వ్యతిరేకంగా రంగారెడ్డి కలెక్టరేట్ ముందు భాజపా జిల్లా అధ్యక్షుడు నర్శింహా రెడ్డి, నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. పెరిగిన జీవన ప్రమాణాలకు అనుగుణంగా 45శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగుల్లో అభద్రతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు'