ఆర్టీసీ సమ్మెలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయినా... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ముందు అర్ధనగ్నంగా నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు పోరాడి గెలవాలే తప్ప.. ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
- ఇదీ చూడండి : 'మా పోరాటానికి మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు'