రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి నగర్లో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత కలిసి మహిళలకు చీరలను అందజేశారు.
తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు సర్కారు చీరలను అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పండుగ పూట ఏ ఒక్క ఆడపడుచు పేదరికంతో గడపకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించి.. చీరలను అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం