ETV Bharat / state

Mayor joins congress: తెరాసకు మరో షాక్.. హస్తం గూటికి మేయర్..! - parijatha reddy resigns trs

Badangipet Mayor joins congress: హస్తం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మరో కీలక నేత చేరేందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఖైరతాబాద్​ కార్పొరేటర్​ హస్తం గూటికి చేరగా.. ఇవాళ తాజాగా బడంగ్‌పేట మేయర్‌ తెరాసకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Mayor joins congress
బడంగ్‌పేట మేయర్‌ పారిజాత
author img

By

Published : Jul 3, 2022, 5:57 PM IST

Badangipet Mayor joins congress: అధికార తెరాసకు మరో షాక్ తగలనుంది. తాజాగా మరో మేయర్‌ తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హైదరాబాద్‌ శివారు బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించారు. రాజీనామా లేఖను రంగారెడ్డి జిల్లా తెరాస అధ్యక్షుడికి పంపించారు.

అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా తెరాసను వీడుతున్నట్లు ఆమె తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ మధ్యాహ్నం పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్​రెడ్డితో కలిసి పారిజాత రెడ్డి దిల్లీకి వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. హస్తినలో పార్టీ పెద్దల సమక్షంలో మేయర్‌ పారిజాత రెడ్డితోపాటు మరికొందరు తెరాస నాయకులు కాంగ్రెస్​లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే తెరాస నాయకులు ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా కాంగ్రెస్‌ పార్టీ గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా పారిజాత విజయం సాధించారు. అప్పట్లో పారిజాతకు మేయర్‌ పదవి ఇచ్చేలా ఒప్పందం జరగడంతో ఆమె తెరాసలో చేరారు. మేయర్‌ పదవి దక్కించుకున్నారు. కొంతకాలంగా పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరుల వద్ద వాపోతున్నారు.

ఇవీ చదవండి: 'ప్రజలు కోరుకుంటున్నారు.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాబోతోంది'

తాజ్ ​మహల్​లోని ఆ 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు లేవా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.