ETV Bharat / state

ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికుల అరెస్టు..

సమ్మె విరమించి ఈ రోజు ఉదయం 6 గంటలకు విధుల్లోకి చేరతామని ప్రకటించిన కార్మికులు డిపోల వద్దకు వస్తున్నారు. దీనితో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్న డిపోల వద్ద పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.

arrest-of-tsrtc-workers-arrested-in-rangareddy-district
ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికుల అరెస్టు..
author img

By

Published : Nov 26, 2019, 1:15 PM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ డిపో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 80 మంది ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్​ పీఎస్​కు తరలించారు. ఆర్టీసీ కార్మికులకు ఒక్కసారిగా డిపో ముందుకు రాగనే పోలీసులకు, కార్మికుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరడానికి గచ్చిబౌలి హెచ్​సీయూ డిపోకు చేరుకున్నారు. దాదాపు 40 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్​కు తరలించారు. ఇప్పటివరకు 30 బస్సులు డిపో నుంచి బయలుదేరాయి.

దిల్​సుఖ్​నగర్​ డిపో వద్ద విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు డిపో వద్దకు రాగా... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపో వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికుల అరెస్టు..

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.