రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ బాహ్యవలయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. చికిత్స పొందుతూ.. మరో ఇద్దరు ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు వారి స్వగ్రామం రాయిచూర్ తరలించారు.
కర్ణాటక రాయిచూర్కి చెందిన వలస కూలీలు సూర్యాపేటలో పని చేస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా పనులు లేకపోడం వల్ల సుమారు 30మంది శుక్రవారం రాత్రి బొలెరో ట్రక్‌లో బయల్దేరారు. పెద్దగోల్కొండ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టగా.. డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో మహిళ చికిత్స పొందుతూ.. ఆస్పత్రితో మృతి చెందింది. తాజాగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ.. రాత్రి ఉస్మానియాలో మరణించారు.
ఇవీ చూడండి: సీఎం సహాయనిధికి ఆర్టీసీ కార్మికుల ఒకరోజు వేతనం