రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లిలోని శ్రీశ్రీశ్రీ సీతారామ ఆంజనేయ స్వామి విగ్రహ, నవగ్రహ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల హనుమాన్ నామ స్మరణతో ఆలయంలో కోలాహలం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
ఎంపీ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ. 20 లక్షలు...
గ్రామీణ ప్రాంతాలలో పార్టీలకతీతంగా దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తాను ఎప్పటికీ కృషి చేస్తానని తెలిపారు. తమ ఎంపీ నిధుల నుండి గుంతపల్లి గ్రామాభివృద్ధికి రూ. 20 లక్షలు కేటాయిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి రెండు రోజుల్లో రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో పార్టీలకతీతంగా దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాలి. మీ సర్పంచ్ కులమతాలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నా వంతుగా నేను సైతం మీ గ్రామాభివృద్ధిలో పాల్గొనాలనే ఉద్ధేశంలో ఎంపీ నిధుల నుండి గుంతపల్లి గ్రామాభివృద్ధికి రూ. 20 లక్షలు కేటాయిస్తున్నాను. అలాగే సర్పంచ్ కోరిక మేరకు ఆలయ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు కేటాయిస్తున్నాను. -ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇదీ చదవండి: Minister Errabelli: అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి