శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ బలగాలు, ఆక్టోపస్ పోలీసులు, రక్షక్ బలగాలు, జీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. యోగ వలన అనేక రోగాలు నయమవుతాయని... అంతేకాకుండా చురుగ్గా ఉంటారని యోగా గురువు తెలిపారు. పురాతన కాలం నుంచి మన పెద్దలు ఆసనాలు వేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం జీవించేవారని తెలిపారు.
ఇవీ చూడండి: యోగాలో నయా ట్రెండ్... మీరు ట్రై చేయండి!