ETV Bharat / state

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఆ కుటుంబం ఏమైనట్లు?

పుట్టిన రోజు సందర్భంగా భార్య, కుమారుడితో సహా శ్రీశైలం వెళ్లిన కుటుంబం కనిపించకుండా పోయిన ఘటన హయత్​నగర్ ఠాణా పరిధిలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

a famaly missing in hayathnagar
పుట్టిన రోజుకని వెళ్లి... కుటుంబంతో సహా అదృశ్యం
author img

By

Published : Dec 18, 2019, 12:27 PM IST

భార్య, కుమారుడితో సహా శ్రీశైలం వెళ్లిన ఓ కుటుంబం కనిపించకుండా పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో జరిగింది. స్థానిక శాంతి నగర్​ కాలనీకి చెందిన శ్రీధర్​ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా గత నెల 30న భార్య, కుమారుడితో కలిసి శ్రీశైలం వెళ్లాడు. మూడు రోజుల వరకు అక్కడే ఉన్న శ్రీధర్ రెడ్డి తల్లితో ఫోన్​లో మాట్లాడాడు. తర్వాత ఫోన్ కలవకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తిరిగి ఈ నెల 5న రాత్రి తల్లితో ఫోన్​లో మాట్లాడాడు. ఛార్జింగ్​లేదని... శ్రీశైలంలోనే ఉన్నట్లు చెప్పాడు. తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడం వల్ల ఈనెల 16న హయత్​నగర్​ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ రెడ్డి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి కాగా... అతడి భార్య ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుంది. వీరికి 15నెలల బాబు ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి వాస్తవంగా శ్రీశైలంలోనే ఉన్నాడా?, మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పుట్టిన రోజుకని వెళ్లి... కుటుంబంతో సహా అదృశ్యం

ఇదీ చూడండి: పోలీస్ ఉద్యోగం వచ్చింది..మృత్యువు వెంటాడింది..

Intro:రంగారెడ్డి జిల్లా : పుట్టిన రోజు సందర్భంగా కుమారుడితో సహా శ్రీశైలం వెళ్లిన దంపతులు కనిపించకుండా పోయిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత నెల 30న శ్రీధర్ రెడ్డి పుట్టిన రోజు పురష్కరించుకోని భార్య, కుమారుడితో కలిసి శ్రీశైలం వెళ్లాడు. మూడు రోజుల వరకు అక్కడే అన్న శ్రీధర్ రెడ్డి తల్లితో ఫోన్ లో మాట్లాడాడు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో తల్లిదండ్రులు అందోళనకు గురయ్యారు. తిరిగి ఈ నెల 5న రాత్రి ఫోన్ చేసి తల్లితో మాట్లాడి చార్జింగ్ లేదని, శ్రీశైలంలోనే ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించిన ఫోన్ కలవకపోవడంతో అందోళనకు గురైన తల్లిదండ్రులు ఈ నెల 16 న హయత్ నగర్ పోలీసులు పిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే శ్రీధర్ రెడ్డి ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగి, భార్య ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది, వీరికి 15 నెలల బాబు ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి నిజంగానే శ్రీశైలంలోనే ఉన్నాడ, ఎమైన, కుటుంబ లేక ఆర్థిక పరమైన విషయాలపై అక్కడే ఉన్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Body:TG_Hyd_25_17_Family Missing_Av_TS10012Conclusion:TG_Hyd_25_17_Family Missing_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.