CVR 2K22 Fest: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగళ్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ సీఎంసీయూ 2K22 ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ టెక్నికల్ ఫెస్ట్ జరుగనుంది. విద్యార్థులు ఏర్పాటు చేసిన పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్టు ఎక్స్పో, ఆటో ఎక్స్పో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏరోస్పేస్, కార్పొరేట్ ప్లానింగ్ ఈసీఐఎల్ డాక్టర్ బ్రజా బి నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![Technical](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-32-12-cvrcollegefest-ab-ts10006_12042022155524_1204f_1649759124_315.jpg)
విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాల్లో ముందుండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక, వైమానిక, సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. వైద్య, డిజిటల్ రంగాలలో భారతదేశం ముందుకు దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నయనతార, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఫెస్ట్‌లో విద్యార్థులు వివిధ విభాగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్మాల్ రోబోస్, త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీస్, నీటి పునర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు తయారుచేసిన ప్రజెంటేషన్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఫెస్ట్‌లో సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: