ETV Bharat / state

నకిలీ వీసాలతో 20 మంది మహిళల అరెస్టు - NAKILI

ఆర్థిక ఇబ్బందులు...నిరుద్యోగ సమస్య...డబ్బు సంపాదించాలనే ఆశ...ఇలా ఏదో ఓ కారణంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ...నకలీ ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు అమాయక ప్రజలు.

నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన మహిళలు
author img

By

Published : Mar 14, 2019, 11:19 PM IST

నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిన మహిళలు
నిన్న నకిలీ వీసాలతో మస్కట్, కువైట్ దేశాలకు వెళ్తున్న 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వర్కింగ్ వీసాతోపాటు విజిటింగ్ వీసానూ వెంట తీసుకెళ్లటాన్ని అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన విమానాశ్రయ పోలీసులు...రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

నమ్మి మోసపోవొద్దు..!
వర్కింగ్ వీసాపైన వెళ్లిన వ్యక్తులకు ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినపుడు...విజిటింగ్ వీసాతో వెంటనే తిరిగి వస్తున్నారు. ఇలా ఏర్పాటు చేయడానికి ఏజెంట్లు వేల రూపాయలు దండుకుంటున్నారని పోలీసులు తెలిపారు. నకిలీ వీసాలతో వెళ్లి విదేశాల్లో అమాయకులైన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. డబ్బు సంపాదించాలన్న ఆశతో నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:సీఎంకు ఎన్నికల నియమావళి పట్టదా?

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.