ETV Bharat / state

యువరైతు ఆత్మహత్యాయత్నం

తాలు ఉందని కారణం చెప్పి తాను పండించిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం దింపడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. మూడు రోజులుగా తిరుగుతున్నా.. మిల్లు యాజమాన్యం ధాన్యాన్ని మిల్లుకు పంపకుండా ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ... యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

Young Formers Suicide Attempt In Rajanna Siricilla District
యువరైతు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jun 5, 2020, 7:56 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన మహిపాల్​ రెడ్డి... వరి పండించాడు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి వాహనంలో సమీపంలోని కనగర్తి రైసుమిల్లుకు ధాన్యం తీసుకెళ్లాడు. మూడు రోజులుగా మిల్లు యాజమాన్యం మహిపాల్​ రెడ్డి ధాన్యాన్ని వాహనంలోంచి దింపకుండానే.. తాలు ఉందని తిప్పి పంపుతున్నారు. మూడు రోజులుగా తిరిగిన యువరైతు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాయత్నం చేశాడు.

కష్టపడి పండించిన పంట మిల్లు యజమానులు తాలు పేరుతో దింపకపోవడం వల్ల యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు రైతును సమీపంలోని ఎల్లారెడ్డి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్​ నుంచి బయటపడే మార్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.