ETV Bharat / state

వేములవాడ మున్సిపల్ వైస్​ఛైర్మన్​ రాజీనామా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వైస్​ ఛైర్మన్ మధు రాజేంద్ర శర్మ తన పదవికి రాజీనామా చేశారు. పాలకవర్గ అంతర్గత విభేదాలతో పదవి నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. తెరాస కౌన్సిలర్లు భాజపా కౌన్సిలర్లతో కలిసిపోయి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

vemulawada municipal vice chairman
vemulawada municipal vice chairman
author img

By

Published : Dec 11, 2020, 2:05 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం వైస్​ ఛైర్మన్​ మధు రాజేంద్ర శర్మ తన పదవులకు రాజీనామా చేశారు. మున్సిపల్ కార్యవర్గంలో గత కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తి పలుమార్లు ఘర్షణలకు దారితీశాయి. స్థానిక ఎమ్మెల్యే రమేశ్​ బాబు... ఇరువర్గాలను ఫోన్​లో మందలించినా గొడవలు పెరిగిపోయాయి.

మనస్తాపం చెందిన వైస్​ ఛైర్మన్​ మధు రాజేంద్ర శర్మ తన రాజీనామా లేఖను కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. తెరాస కౌన్సిలర్లు భాజపా కౌన్సిలర్లతో కలిసిపోయి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.