ETV Bharat / state

Childrens letter to KTR: 'కేటీఆర్​ సార్.. మా నాన్నను బతికించండి'.. చిన్నారుల కన్నీటి లేఖ - father health

Childrens letter to KTR: సార్​ మా నాన్నని బతికించండి.. అంటూ ఆ చిన్నారులు రాసిన లేఖ అందరి హృదయాలను కదిలిస్తోంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న నాన్నను కాపాడండి అంటున్న వారి వేదన కళ్లముందే కనిపిస్తోంది. ఎలాగైనా సరే తండ్రిని బతికించుకోవాలన్న చిన్నారుల సంకల్పం మనకు సాక్షాత్కరిస్తోంది. తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ మంత్రి కేటీఆర్​ను చిన్నారులు వేడుకుంటున్నారు.

Childrens letter to KTR:
మంచానికే పరిమితమైన మామిండ్ల శ్రీనివాస్
author img

By

Published : Jun 27, 2022, 7:14 PM IST

Childrens letter to KTR: కాళ్లకు తడి అంటకుండా ప్రపంచాన్ని చుట్టి రావచ్చు.. కానీ కళ్లకు తడి అంటకుండా జీవితాన్ని దాటలేము అంటారు ఓ కవి. కానీ ఓ కుటుంబం నిత్యం కన్నీళ్ల మధ్య జీవనం సాగించాల్సిన దయనీయమైన పరిస్థితి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని నడిపించాల్సిన మనిషి అనారోగ్యంతో అచేతనంగా కళ్లముందే కదల్లేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి దినదిన గండంగా మారింది. బీడీలు చుడుతూనే చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆ కన్నతల్లి పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. వైద్యం అందిస్తే కన్నతండ్రి కోలుకుని కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆశ.. ఆ పసి మనసుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రిని బతికించుకోవాలన్న తపన కనిపిస్తోంది. కన్నీళ్లతో మంత్రి కేటీఆర్ సార్​ మా నాన్నను బతికించండి అంటూ చిన్నారులు రాసిన లేఖ ప్రతి ఒక్కరికీ కన్నీళ్లను తెప్పిస్తోంది. వైద్యం అందించలేని స్థితిలో ఓ నిరుపేద కుటుంబం ఆవేదనపై అందిస్తున్న మానవీయ కథనం.

Childrens letter to KTR:
మంచానికే పరిమితమైన మామిండ్ల శ్రీనివాస్

కేటీఆర్ సార్ నమస్తే. నా పేరు రుచిత. మా నాన్న ప్రాణం బాగుంటలేదు. ఇప్పటికే నాలుగేళ్లయింది. మా ఇల్లు కుడా కూలిపోయింది. మేం కిరాయికి ఉంటున్నాం. మా నాన్న ఆస్పత్రికి రెండు లక్షలైనాయి. మీకు లెటర్​ రాస్తున్నాం కేటీఆర్ సార్. మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలి. - రుచిత, సుచిత, శ్రీనివాస్ కుమార్తెలు

నాకు ముగ్గురు పిల్లలు. పాత ఇల్లు కూలిపోయింది. కిరాయికి ఉన్నా సార్. రెండు లక్షలు ఖర్చు చేసినాం. నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి. సార్ మీరు ఎలాగైనా మా ఆయనను కాపాడాలి సార్. మా కుటుంబాన్ని దయచేసి ఆదుకోండి సార్.

-మంజుల, శ్రీనివాస్ భార్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల శ్రీనివాస్ ఉపాధి కోసం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. పట్టణంలోని తుక్కారావుపల్లెలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తల్లి మల్లవ్వ, భార్య మంజుల, కూతుళ్లు రుచిత, సునీత, కుమారుడు బాబుతో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ హమాలి కార్మికునిగా పనిచేస్తుండగా.. మంజుల బీడీలు చుడుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. కుటుంబం గడవడానికి శ్రీనివాస్ హమాలీ పని చేస్తే వచ్చే ఆదాయమే ప్రధానం. కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్యానికి గురికావడంతో అప్పులు చేసి​ బతికించుకునేదుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రోజు రోజుకు శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో కుటుంబం తీరని కష్టాల్లో మునిగిపోయింది. నాలుగు నెలలుగా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. బక్కచిక్కి ఎముకల గూడులా మారిపోయాడు. ఇతరుల సహాయం లేనిదే రోజూ వారీ కార్యకలాపాలు చేసుకోలేని స్థితికి చేరుకున్నాడు.

Childrens letter to KTR:
కేటీఆర్​ సార్​కు లేఖ రాస్తున్న ఇద్దరు కుమార్తెలు

ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో భర్త బాగోగులు చూసేందుకు మంజులకు టైం సరిపోతోంది. దీంతో కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటి అద్దెలతోపాటు కుటుంబం గడిచే దారి లేకపోవడంతో నిస్సహాయస్థితికి చేరింది. ప్రస్తుతం శ్రీనివాస్ కూతుళ్లు రుచిత, సుచితలు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. కుమారుడు బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. నాన్న భుజాల పైనుంచి ప్రపంచాన్ని చూడాల్సిన చిన్నారులు నాన్న ఏమైపోతాడో అనే ఆవేదన వర్ణనాతీతం. ఓ వైపు కుటుంబం గడవని పరిస్థితులు మరోవైపు వైద్యం అందించి నాన్నను బతికించుకునే దారి లేక తల్లడిల్లుతున్నారు. ఇలాంటి తరుణంలో చిన్నారులు మానవత్వంతో మా నాన్నను బతికించండి సార్.. అంటూ కన్నీళ్లతో మంత్రి కేటీఆర్​కు లేఖ రాశారు. తమ కుటుంబం ఉన్న పరిస్థితులను వివరిస్తూ వైద్య సహాయం అందించి ఆదుకోవాలని లేఖలో కోరారు. వైద్యం అందించలేని దయనీయ స్థితిలో ఉన్న కష్టం నుంచి గట్టెక్కించాలని కుటుంబం వేడుకుంటున్నారు.

'కేటీఆర్​ సార్.. మా నాన్నను బతికించండి'.. చిన్నారుల కన్నీటి లేఖ

ఇవీ చదవండి:

Errabelli meet Rakesh family: చేతులెత్తి మొక్కుతున్నా.. రాజకీయం చేయకుండ్రి: ఎర్రబెల్లి

రెచ్చిపోయిన దొంగలు.. గన్స్​తో వచ్చి చోరీ.. అడ్డొచ్చిన యజమాని హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.