రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామిని తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కల్యాణ మండపంలో స్వస్తి పఠనం గావించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ వార్తతో చిగురించిన ఆశలు.. సాయం కోసం ఎదురుచూపులు