రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. పని భారం పెంచుతూ ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆర్టీసీ డిపో వద్ద నిరసన తెలిపారు. సిరిసిల్ల-కరీంనగర్ నాన్ స్టాప్ బస్సు గతంలో ఐదు ట్రిప్పులు చేసి ఒకరోజు సెలవు తీసుకునే వారిమని తెలిపారు.
సమ్మె అనంతరం ఐదు ట్రిప్పులు కొట్టి సెలవు ఇవ్వకుండా... మరుసటి రోజు కూడా విధులు నిర్వర్తించాలని అధికారులు ఇబ్బంది పెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాత పద్ధతినే కొనసాగించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఇప్పటికే ఆర్టీసీ డిపో నష్టాల్లో ఉందని, డిపో అభివృద్ధి కోసమే పని చేయాలని చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ