రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ అనే పోలీస్ కానిస్టేబుల్ కరోనా వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. సొంత డబ్బులతో మైక్, స్పీకర్ కొని, దాన్ని వీపున కట్టుకొని కరోనా రాకుండా మాస్క్‌లు కట్టకోమంటూ అవగాహన కల్పిస్తున్నాడు. జనసమ్మర్దం ఉన్నచోట చేతిలో మైక్ పట్టుకొని 'అమ్మా.. మాస్క్ కట్టుకోండి. కరోనా రాకుండా జాగ్రత్త పడండి' 'అయ్యా.. ముఖానికి మాస్క్ కట్టుకోండి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోండి' అంటూ ప్రచారం చేస్తున్నాడు.
సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్రగా తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేస్తూ కరోనా వ్యాధి గురించి అప్రమత్తంగా వుండాలని శ్రీనివాస్ సూచిస్తున్నాడు. కూరగాయల మార్కెట్లు, బస్టాండ్లు, పాదచారుల దగ్గరకు వెళ్తూ అత్యవసరమైతే తప్ప రోడ్డు మీదకు రావద్దంటూ దండం పెడుతూ బతిమిలాడి చెప్తున్నాడు. విధులు ముగియగానే.. ఇలా మైక్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉచితంగా మాస్క్‌లు పంచుతున్నాడు. తన ప్రచారం పట్ల కొంతమందైనా మారి బయటకు రాకుండా ఉంటారని, కరోనా వ్యాధి బారిన పడకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు శ్రీనివాస్.
ఇవీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము