VEMULAWADA TEMPLE: రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దివ్య కల్యాణం అంగరంగా వైభవంగా కన్నుల పండువగా జరిగింది.
వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతి దేవి అమ్మవారిని మేళతాళాలలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్న మూహుర్తమున ఉదయం 10 .56 నిమిషాల నుంచి 12.50 నిమిషాల వరకు వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్ ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణం చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: Yadadri Temple News : యాదాద్రిలో అద్భుతఘట్టానికి అంకురార్పణ