ETV Bharat / state

కూలీ రేటు పెంచాలని వార్పిన్​ కార్మికుల సమ్మె - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టెక్స్​టైల్ పార్క్ వార్పిన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. టెక్స్ టైల్ పార్క్​లో ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేటు తమకు గిట్టుబాటు కాదని.. ఇక నుంచి పని చేయమని... తీర్మానం చేసినట్లు వార్పిన్ కార్మికులు తెలిపారు.

Rajanna Sirisilla District Textile Park Warpin Workers Strike
కూలీ రేటు పెంచాలని వార్పిన్​ కార్మికుల సమ్మె
author img

By

Published : Apr 18, 2021, 3:50 AM IST

టెక్స్​టైల్ పార్క్​లో వార్పిన్ కార్మికులకు ప్రస్తుతం మీటర్​కు ఇస్తున్న 31 పైసలు కూలీ సరిపోవడం లేదని... రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వార్పిన్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు బడుగు యాదగిరి తెలిపారు. ప్రభుత్వ వస్త్రాలు, బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా అదనంగా కూలీ చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే అనేక సార్లు పరిశ్రమల యజమానులను అడిగినా పట్టించుకోలేదన్నారు.

అందుకే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తున్నామని ఆయన అన్నారు. కార్మికుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కూలీ పెంచేందుకు ముందుకు రాకపోవడం వలన కార్మికులందరూ తమ పనులు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆసరా పింఛన్లకు రూ. 11 వేల 508 కోట్లు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.