రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘పది గంటలకు పది నిమిషాలు’ కు మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుందాం.. దోమలను నివారిద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొని తన ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తన ఇంటి పరిసరాల్లోను మొక్కలకు నీరు పోశారు. చెట్ల పొదల్లో ఉన్న చెత్తను తొలగించారు. ప్రజలంతా తమ ఇళ్లను, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సూచించారు.