లాక్డౌన్ వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల సందర్శనను అధికారులు నిలిపివేశారు. కానీ స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలనుకునే వారికోసం ఆన్లైన్ సదుపాయం కల్పించారు.
11 రకాల పూజల కోసం భక్తులు ఆన్లైన్లో రుసుము చెల్లిస్తే వారి గోత్రనామాలతో రాజరాజేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 22 రోజుల నుంచి ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా ఆలయానికి రూ.84,050 సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.
రాజన్నకు ఆన్లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకోవాలనుకునే వారు https://meeseva.telangana.gov.in , గూగుల్ ప్లే స్టోర్ లో t app folio ద్వారా పూజలను బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించారు.