కన్నీరు కారిన చోటే గంగ పరవళ్లు తొక్కి ఆనంద భాష్పాలు కురిపించిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
![Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer, ముస్తాబాద్ పెద్ద చెరువు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11310981_mustabad2.jpg)
మండు వేసవిలోనూ కాళేశ్వరం జలాలతో చెరువులు ఉప్పొంగుతున్నాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటితో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువు నిండుకుండలా మారటం పట్ల ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యకం చేశారు. అలుగు పారుతున్న ముస్తాబాద్ చెరువుకు సంబంధించి కొన్ని ఆహ్లాదకరమైన చిత్రాలను పంచుకున్న మంత్రి... ఈ సన్నివేశం ఆనంద భాష్పాలు కురిపించిందని పేర్కొన్నారు.
![Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer, ముస్తాబాద్ పెద్ద చెరువు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11310981_mustabad1.jpg)
![Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer, ముస్తాబాద్ పెద్ద చెరువు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11310981_mustabad.jpg)
![Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer, ముస్తాబాద్ పెద్ద చెరువు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11310981_mustabad3.jpg)