రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జీహెచ్ఎంసీ తరహాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అనంతరం పురపాలక కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.