రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు రోడ్డు నిర్మాణం పనులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ప్రొక్లైన్ను నడుపుతూ రోడ్డుపైన పాత మట్టిని ఎమ్మెల్యే తొలగించారు. పుణ్యక్షేత్ర రహదారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేశారని వెల్లడించారు.
డీఎంఎఫ్టీ నిధులు కింద రెండు కోట్ల 27 లక్షల రూపాయలతో ఏడు కిలో మీటర్ల రోడ్డు నిర్మించన్నట్లు వెల్లడించారు. కొదురుపాక, బోయినపల్లి, గంగాధరకు డబుల్ రోడ్డుగా మార్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్