Chennamaneni Citizenship Dispute: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. పౌరసత్వం రద్దు చేయడానికి చట్టంలో ప్రస్తావించిన కారణాలు లేకపోయినప్పటికీ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని చెన్నమనేని తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వివాదంపై హోంశాఖ పరిధిలోని సరిహద్దు నిర్వహణ విభాగం కార్యదర్శి విచారణ జరిపారని అన్నారు. అయితే పౌరసత్వం రద్దు చేస్తూ హోంశాఖ అండర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు చట్ట ప్రకారం చెల్లవని చెన్నమనేని తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 29 కి వాయిదా వేసింది.
చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: Niranjan Reddy Comments: 'ప్రేమలేఖలు రాసేందుకు దిల్లీకి వచ్చామా..?'