ETV Bharat / state

KTR: 'కేసీఆర్‌ సీఎం అయ్యాకే సిరిసిల్లకు మంచిరోజులు'

author img

By

Published : Jul 30, 2021, 1:24 PM IST

Updated : Jul 30, 2021, 4:48 PM IST

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతో సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్(ktr) అన్నారు. మేడిన్‌ సిరిసిల్ల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుందని తెలిపారు. అపరెల్ పార్కులో గోకుల్‌దాస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.

minister ktr, ktr sircilla visit
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన, అభివృద్ధి పనులకు కేటీఆర్ భూమిపూజ

సిరిసిల్లలో కార్మికులను ఆసాములుగా తీర్చిదిద్దే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు అపెరల్ పార్క్‌లోని 60 ఎకరాల్లో రూ.24కోట్లతో నిర్మించనున్న గోకుల్‌దాస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సిరిసిల్లలో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేసే గొప్ప సంస్థ ఇక్కడ ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. మేడిన్‌ సిరిసిల్ల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుందని వివరించారు.

సిరిసిల్ల... సిరిశాల

ఒకనాడు ఆత్మహత్యలతో ఉరిశిల్లగా చెప్పుకున్న సిరిసిల్లను... నేడు సిరిశాలగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ అపెరల్ పార్క్‌ ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని... అందులోను మహిళలకు అధికశాతం ఉపాధి దొరికేందుకు ఆస్కారముందని అన్నారు.

ఇది ఆరంభమే..

కొత్తగా ప్రారంభమైన ఈ అపెరల్ పార్క్‌ ఒక ఆరంభం మాత్రమేనని... దీనితో పాటు అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలని కోరారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందన్న మంత్రి.. దేశంలోనే అత్యంత నాణ్యమైందని వివరించారు. ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలని కోరారు.

త్వరలో చేనేత బీమా

ఒక్క అపరెల్ పార్కులో 60 ఎకరాల్లో పెట్టుబడులు పెట్టి... పెద్దమొత్తంలో అనగా 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. మేడిన్ సిరిసిల్ల బ్రాండ్ ప్రపంచ విపణికి చేరుకోవాలి. ప్రపంచానికి మన నైపుణ్యం తెలియాలి. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. రైతు బీమా మాదిరే చేనేత బీమాను త్వరలో ప్రారంభించి... ఏ కారణం చేతనైనా నేతన్న మృతిచెందితే రూ.5లక్షలను ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవలె ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం.

-మంత్రి కేటీఆర్

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్

ప్రత్యేక శ్రద్ధతోనే..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోకుల్‌దాస్‌ ఇమేజెస్ ఎండీ సుమీర్ హిందూజా... తాము గత 4నాలుగు దశాబ్దాలుగా బెంగుళూరులో తప్ప ఎక్కడ పరిశ్రమ పెట్టలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తాము ఉత్పత్తి చేసే వస్త్రాలు చైనాతో పోటీ పడతాయని పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారికి తాము శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తామని వివరించారు.

ఇదీ చదవండి: కేటీఆర్​ను ఆశ్రయించిన రష్మి.. సాయం చేయాలంటూ వినతి!

Last Updated : Jul 30, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.