ETV Bharat / state

KTR: అధికారులూ జాగ్రత్త.. తప్పు చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్‌..: కేటీఆర్‌ - కలెక్టరేట్​లో మంత్రి

పోడు భూములపై హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఏదైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అటవీ భూములు ఆక్రమించకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దరఖాస్తు పెట్టుకున్న పోడు రైతుల అర్జీలని పరిశీలిస్తామని తెలిపారు. పోడు భూములపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

KTR
KTR
author img

By

Published : Nov 6, 2021, 7:42 PM IST

ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తాం: కేటీఆర్

పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోడు భూములపై జరిగిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని వెల్లడించారు. ఏదైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. కలెక్టరేట్లలో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

హరితహారంతో పచ్చదనం పెరిగింది

హరితహారంతో మూడేళ్లలో 4.5 శాతం పచ్చదనం పెరిగిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అటవీ భూములు ఆక్రమణలు జరగకూడదనే హక్కుపత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేయాలని సూచించారు. అవసరమైతే వీడియో చిత్రీకరించాలని స్పష్టం చేశారు. కఅధికారులు తప్పు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. అటవీ భూములపై అధికారులు కోర్టుల్లోనూ పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

భవిష్యత్‌లో అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అటవీ భూమిని సంరక్షణ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోడు భూములపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

దాదాపు 8 వేల ఎకరాల్లో అటవీ భూములను అక్రమించుకున్నారని 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి సమస్య పరిష్కరించాలని చూస్తున్నామన్నారు. నవంబర్ 8 నుంచి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 4 లక్షల 72 వేల 329 ఎకరాల భూమి ఉందని మంత్రి తెలిపారు.

దరఖాస్తులు పెట్టుకున్న పోడు రైతుల అర్జీలను పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్​లో అటవీ భూములను ఆక్రమించుకుండా భూములు కేటాయించిన వారితో ప్రతిజ్ఞ తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వానికి మరో ఎజెండా ఏమీ లేదని కేటీఆర్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

చిప్పలపల్లి గ్రామాల మధ్య దుర్గ రెడ్డి అనే వ్యక్తి 70 ఎకరాలు అటవీ భూమి అక్రమించారని స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి ముస్తాబాద్ తహసీల్దార్, ఆర్డీవో వెళ్లి పారదర్శకంగా దర్యాప్తు చేసి వీడియో రికార్డ్ చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూముల వ్యవహారంలో అధికారులు ఎవరికి తలొగ్గవద్దని సూచించారు. అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారికి అవసరమైతే భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

అటవీ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రభుత్వ సొత్తు కాదు. ఇది ప్రజల సొత్తు. అటవీ భూముల రక్షణ బాధ్యత మనందరిపై ఉంది. జీవనోపాధి ఎంత ముఖ్యమో పర్యావరణ సమతుల్యత కూడా ముఖ్యం. ఇటీవల కరోనా సమయంలో మనం ఆక్సిజన్ కొరతను మన చూశాం. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అకాల వర్షాలు, వరదలు చూస్తా ఉన్నాం. వీటిని అధిగమించేందుకు జిల్లా ఫారెస్ట్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలి. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కుగా దీన్ని భావించాలి. సీఎం ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దేశం మొత్తానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలి. ఇందులో మరో అభిప్రాయం ఉండకూడదు. పేదవారికి న్యాయం చేయడం.. మరోవైపు పర్యావరణాన్ని పరిరక్షించడం మన లక్ష్యం.- కేటీఆర్, రాష్ట్ర మంత్రి

ఇదీ చూడండి:

Minister KTR: 'రాష్ట్రానికి కొత్త రైళ్లు, లైన్లు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.