రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని ఇటుక బట్టిల్లో పనిచేసే ఒడిశా కార్మికులు తమ సొంత ప్రాంతాలకు కాలినడకన బయలు దేరారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.
యజమాని డబ్బులు కూడాఇవ్వకపోవటం వల్ల కాలి నడకన స్వరాష్ట్రానికి బయలుదేరామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లాపాపలు, వృద్ధులు సామాగ్రితో బయలుదేరిన కార్మికులకు స్థానికంగా పలువురు తమకు తోచిన సాయం చేశారు.