పరిహారం చెల్లించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు నిర్వాసితులు పాదయాత్ర నిర్వహించారు. నిధులు వెంటనే విడుదల చేయాలని ఐక్య సంఘాల ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండలం నీలోజ్ నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, భాజపా నేత ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకోండి
మధ్యమానేరు నిర్వాసితులకు రూ.5 లక్షల పరిహారం, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కానీ ఇప్పుడు పరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సర్కారు నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ నిర్వాసితులతో కలిసి దశల వారీగా ఆందోళన చేస్తామని అఖిల పక్షం నేతలు హెచ్చరించారు.
ఇదీ చూడండి : బంద్‌లో వైద్యులు... ఇబ్బందుల్లో రోగులు