రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి చతుష్షష్టి ఉపచారములతో విశేష పూజలు నిర్వహించారు.
వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆలయ అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఆలయంలో నిర్వహించే నిత్యపూజలను అర్చకులు నిర్వహించారు.
ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'